రియల్‌మి నుంచి భారత్ మార్కెట్‌లోకి త్వరలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. రియల్‌మి నార్జో 80 ప్రో 5G, నార్జో 80x 5G హ్యాండ్‌సెట్‌లు విడుదల కానున్నాయి. లాంచ్ వివరాలతోపాటు కొన్ని స్పెసిఫికేషన్లు, ధరల వివరాలను కూడా వెల్లడించింది. నార్జో 80 సిరీస్ లో భాగంగా ఈ రెండు ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి.
రియల్‌మి నార్జో 80 ప్రో 5G ఫోన్ : ఈ ఫోన్ (Realme Narzo 80 Pro 5G Smartphone) చిప్‌సెట్ వివరాలను గతంలోనే రియల్‌మి వెల్లడించింది. ఈ ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఫలితంగా గేమింగ్ సహా మల్టీ టాస్కింగ్ సమయంలో మెరుగైన పనితీరు కనబరుస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 7.5mm థిక్‌నెస్‌తో స్లీక్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. మరియు ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. ఈ ఫోన్ 6050mm2 వీసీ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. మరియు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని పేర్కొంది. రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,000 కంటే తక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ ధరలో డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యే హ్యాండ్‌సెట్ ఇదేనని రియల్‌మి చెబుతోంది.
రియల్‌మి నార్జో 80x 5G ఫోన్ : రియల్ నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo 80x 5G Smartphone)120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా విడుదల కానుంది. ఈ బేస్ వేరియంట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలిపింది. నార్జో 80x 5G ఫోన్ రూ.15000 ధర సెగ్మెంట్‌లో లభిస్తుందని రియల్‌మి తెలిపింది.
![]() |
![]() |