2025 IPLలో భాగంగా లక్నో సూపర్ జయింట్స్ vs పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి లక్నో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పంజాబ్ బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టమైన ప్రదర్శన చూపించారు. నికోలస్ పూరన్ (44), అయుష్ బదోని (41) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మార్క్రమ్ (28), అబ్దుల్ సమద్ (27) కొంతవరకు రాణించినా, కెప్టెన్ రిషభ్ పంత్ (2) మరోసారి పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 కీలక వికెట్లు పడగొట్టగా, ఫెర్గూసన్, మ్యాక్స్‌వెల్, మార్కో జాన్సన్, యుజ్వేంద్ర చాహల్ ఒక్కో వికెట్ తీసి లక్నోను కట్టడి చేశారు.
ఈ మ్యాచ్ లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69) మెరుపు అర్థశతకం సాధించడంతో ఈ మ్యాచ్ పూర్తిగా వన్‌సైడ్‌గా మారిపోయింది. అయ్యర్ అర్ధశతకం (52 నాటౌట్) సాధించి మరోసారి ఆకట్టుకున్నాడు. చివర్లో నేహల్ వధేరా (43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌ను వరుసగా రెండో విజయాన్ని సాధించేందుకు దోహదపడ్డాడు. లక్నో బౌలర్ దిగ్వేష్ రతి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో ప్రభ్‌సిమ్రన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
![]() |
![]() |