అమెరికన్ కాంగ్రెస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా డెమోక్రాట్ సెనేటర్ కోరే బూకర్ ఏకధాటిగా 25 గంటలకు పైగా ప్రసంగించి రికార్డు సృష్టించారు. సోమవారం సాయంత్రం ప్రారంభమైన ఆయన ప్రసంగం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఆయన ప్రసంగం మొత్తం నిలబడే సాగింది. మధ్యలో చిన్నపాటి విరామం కూడా తీసుకోకుండా, కనీసం వాష్‌రూముకు కూడా వెళ్లకుండా ఆయన ప్రసంగించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన అసాధారణ సామర్థ్యానికి అందరూ ఆశ్చర్యపోయారు.మన పార్లమెంట్, అసెంబ్లీలా కాకుండా అక్కడ సెనేటర్ మాట్లాడేందుకు కాలపరిమితి ఉండదు. దీనిని బూకర్ సద్వినియోగం చేసుకున్నారు. ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శించారు. బూకర్ 2020లో డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి బరిలో నిలిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి జో బైడెన్‌కు మద్దతునిచ్చారు.1957లో పౌర హక్కుల చట్టం ఆమోదం సందర్భంగా రేసిస్ట్, సెనేటర్ స్టార్మ్ థర్మోండ్ 24 గంటల 18 నిమిషాలు మాట్లాడారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు కాగా, ఇప్పుడు బూకర్ 25 గంటలకు పైగా మాట్లాడి ఆ రికార్డును బద్దలుగొట్టారు.
![]() |
![]() |