తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నాయిని సూర్యనారాయణ , పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఎచ్చర్ల వైసిపి అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ సారధ్యంలో వైకాపాలో చేరుతున్నట్టు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పేరున్న నాయకుడు గా నాయిని సూర్యనారాయణ రెడ్డి లావేరు మండలం కేశవరాయుడి పాలెంకు చెందిన వ్యక్తి. 2009లో ప్రజారాజ్యం పార్టీలో కీలక భూమిక పోషించిన ఆయన ఆపై కాంగ్రెస్‌లోనూ, తదుపరి తెలుగుదేశం పార్టీలోనూ చేరారు. అమ్మనాన్న ఛారిటబుల్ ద్వారా సేవలందిస్తున్నారు.
వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరిన సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ... ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత పథకాలు అమలుకు చంద్రబాబు ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని జగన్ చేతిలో పెడితేనే గాడిలో పడుతుందని, లేదంటే అప్పులపాలవుతుందని అభిప్రాయపడ్డారు. నాయిని పార్టీని వీడటంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుకి కొంత ఇబ్బందేనని పరిశీలకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa