వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను నేడు అనంతపురం కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. 2018లో అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో అనిల్‌పై సీఆర్ నెంబర్ 156/2018 u/s 419 186 506 IPC కింద కేసు నమోదు అయ్యింది. ఇప్పటి వరకు అనిల్ వాయిదాలకు హాజరుకాకపోవడంతో పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురానికి తరలించారు. 2018లో అనంతపురం చర్చి విషయంలో ఐపీఎస్ అధికారినంటూ అప్పటి సీఐ మురళీకృష్ణను ఫోన్‌లో బెదిరించాడు బోరుగడ్డ అనిల్. రామచంద్రనగర్‌లోని చర్చ్ విషయంలో ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలంటూ సీఐ మురళీకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ కేసులో ఈరోజు (శుక్రవారం) ఉదయం బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం త్రీ టౌన్ పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.
![]() |
![]() |