వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల ద్వారా ఆమోదం పొందడం కేవలం పార్లమెంటరీ విజయం కంటే ఎక్కువ ప్రతిబింబిస్తోందని ఇది న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం వైపు ఒక చారిత్రాత్మక అడుగు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో.. ఎన్డీయే పరిపాలన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి తన నిబద్ధతను మరోసారి నిరూపించుకుందన్నారు. సంవత్సరాలుగా, వక్ఫ్ బోర్డుల కార్యకలాపాల గురించి తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయన్నారు. వక్ఫ్ బోర్డు సవాళ్లను పరిష్కరించడం, పారదర్శకతను పెంచడం, వక్ఫ్ ప్రయోజనాలు పేద ముస్లింలకు చేరేలా చూడటం, ముస్లిం మహిళలకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం వైపు ఈ సవరణ ఒక ముఖ్యమైన అడుగు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
![]() |
![]() |