అందరినీ కలుపుకొని విశాఖపట్నం అభివృద్ధికి తద్వారా ఆంధ్రప్రదేశ్ వికాసానికి కృషి చేయడమే తన లక్ష్యమని విశాఖ ఆర్చ్ బిషప్ ఉడుముల బాల అన్నారు. జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ మైదానంలో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్చి బిషప్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ వేడుకకు పోప్ రాయబారి, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ లియోపోల్డో గెరెల్లి నేతృత్వం వహించారు. విశాఖపట్నం రోమన్ కేథలిక్ అగ్ర పీఠానికి ఉడుమల బాల ఇకపై బాధ్యత వహిస్తారని ప్రకటించారు. ఈ సందర్భంగా ఉడుముల బాల మాట్లాడుతూ.. వరంగల్ తన జన్మభూమి అని, విశాఖపట్నం పుణ్యభూమి అని పేర్కొన్నారు.
![]() |
![]() |