రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు లారస్ ల్యాబ్స్ సంస్థ ముందుకు వచ్చింది. అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో దాదాపు రూ.5వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమను నెలకొల్పనుంది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. లారస్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్న కొత్త పరిశ్రమలకు భూములు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ సీఈవో చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహారావు గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి చర్చలు జరిపారు. తమ పరిశ్రమలకు భూకేటాయింపులు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
![]() |
![]() |