బాపట్ల జిల్లా విద్యుత్ శాఖ సిబ్బంది మృతిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి చెందారు. ఈ సందర్భంగా శుక్రవారం అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా సిబ్బంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. విద్యుదాఘాతం ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ఎల్‌సీ తీసుకునే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు.
![]() |
![]() |