తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయ ప్రధాన అర్చక పదవి నుంచి తనను తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా బదిలీ చెయ్యాలంటూ పెద్దింటి కుటుంబానికి చెందిన శ్రీనివాస దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరుగగా.. శ్రీనివాస దీక్షితుల పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. పరిపాలన పరమైన అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్ఫష్టం చేసింది. ఉద్యోగిగా టీటీడీ ఎక్కడ విధులు కేటాయిస్తే అక్కడ విధులు నిర్వర్తించాలని పిటిషనర్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
![]() |
![]() |