ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య ఘటనపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమన్నారు. బాధిత విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆత్మహత్యకు కారకుడిపై చట్ట ప్రకారం చర్యలుంటాయన్నారు. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమని.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలో ఇంటర్న్‌గా ఉన్న నాగాంజలి తన సూసైడ్ నోట్‌లో కారకుడిగా పేర్కొన్న ఆసుపత్రి ఏజీఎం డా.దువ్వాడ దీపక్‌ను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియచేశారన్నారు. కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
![]() |
![]() |