ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సైక్లింగ్ వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. సైకిల్ తొక్కేటప్పుడు శ్వాస సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా నిద్రలేమితో బాధపడుతున్నవారు సైకిల్ తొక్కితే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.బరువు తగ్గాలనుకునేవారికి సైక్లింగ్ ఒక మంచి మార్గం అని నిపుణులు చెబుతున్నారు. సైకిలింగ్ జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది, కండరాలను పెంచుతుంది, శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే.. మీ రొటీన్‌లో సైక్లింగ్‌ను కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. వ్యాయామం ద్వారా వారానికి కనీసం 2,000 కేలరీలు బర్న్ చేయాలని పరిశోధనలు సూచిస్తున్నాయి. స్థిరమైన సైక్లింగ్ గంటకు సుమారు 300 కేలరీలు బర్న్ చేస్తుంది. సైక్లింగ్ మీ బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. బ్రిటీష్ పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ అరగంట సైకిల్ తొక్కితే.. ఒక ఏడాదిలో దాదాపు ఐదు కిలోల కొవ్వును కరిగిస్తుంది.
![]() |
![]() |