ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోంబేపల్లి మండలం యర్రగుంట్ల దగ్గర రెండు కార్లు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవీ మృతిచెందగా.. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో బాధితులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. మృతిచెందిన డిప్యూటీ కలెక్టర్ రమ.. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఆమె స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం.
![]() |
![]() |