అద్దంకి మండలం చక్రాయపాలెం పంచాయతీని మండల ఈవో. పీ. ఆర్డి ప్రసాదరావు సోమవారం పరిశీలించారు. సిబ్బందికి ఐ. వి. ఆర్. ఎస్ కాల్స్ పై అవగాహన కల్పించారు.
గ్రామంలో ప్రతి 2, 3 రోజులకు ఒకసారి ఇంటి నుండి చెత్తను సేకరిస్తున్నారా లేదా అనే విషయాన్ని ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 100% డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ తప్పనిసరిగా సేకరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa