బాలీవుడ్ స్టార్ హీరో భార్యకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. ముఖ్యంగా నాలుగు రోజుల క్రితమే ప్రాణాలు కోల్పోయిన నటుడు మనోజ్ కుమార్ మృతికి సంతాపం తెలియజేస్తూ.. ఆయన భార్య శశి గోస్వామికి లేఖను పంపారు. ఈ లేఖలో మనోజ్ కుమార్ తో కలిసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆయనకు తనతో ఉన్న అనుబంధం గురించి చర్చించారు. ముఖ్యంగా మనోజ్ కుమార్‌తో తనకు ఉన్న బంధం గురించి, అతడితో కలిసి పంచుకున్న క్షణాల గురించి రాసి ఆయన భార్యకు వాటిని వివరించారు. మనజో కుమార్ నాలుగు రోజుల క్రితమే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా.. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ మోదీ ఈ ఉత్తరం రాశారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. అంతా అందులో ఏముందో తెలుసుకోవాలని తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
బాలీవుడ్ స్టార్ హీరో మనజో కుమార్ 87 ఏళ్ల వయసులో.. ఏప్రిల్ 4వ తేదీన కన్నుమూశారు. శుక్రవారం రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కాలేయ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఆయన.. సిర్రోసిస్ వ్యాధి కారణంగానే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మనోజ్ కుమార్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు అంతా సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సైతం స్పందించారు. ఆయనతో వారికున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను పూర్తి చేశారు.
ఇదిలా ఉండగా.. మనోజ్ కుమార్ మృతి చెందిన మూడ్రోజుల తర్వాత ప్రధాని మోదీ ఆయన భార్య శశి గోస్వామికి లేఖ రాశారు. అందులో మనోజ్ మృతి పట్ల హృదయపూర్వక సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. మనోజ్ కుమార్ మరణం తనకు చాలా బాధ కల్గించిందని.. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్టున్నట్లు వెల్లడించారు. మనోజ్ కుమార్ తన చిత్రాల ద్వారా భారతదేశ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన నటించిన అనేక చిత్రాలు దేశ ప్రజల్లో దేశభక్తిని బలోపేతం చేశాయని చెప్పుకొచ్చారు.
అలాగే మనోజ్ కుమార్ పోషించిన వివిధ పాత్రలు స్వాతంత్ర్య పోరాటాన్ని ఉత్తేజ పరిచాయని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే దేశ కోసం మైరుగైన భవిష్యత్తు కోసం పని చేయడానికి ప్రజలను ప్రేరేపించాయన్నారు. ఆయన సహకారాన్ని గుర్తిస్తూ.. సమాజం పట్ల తన బాధ్యతను కళాత్మకంగా వ్యక్తపరచడం ద్వారా సినిమాను నిరంతరం సుసంపన్నం చేశారని వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతి మరియు విలువలపై ఆధారపడిన ఆయన చిత్రాల్లోని అనేక పాటలు.. దేశం పట్ల ప్రేమ మరియు అంకితభావనను వ్యక్తపరుస్తాయన్నారు. దీన్ని ప్రజలెప్పుడూ గుర్తు పెట్టుకుంటారని లేఖలో వెల్లడించారు.
అలాగే మనోజ్ కుమార్‌తో గడిపిన క్షణాలు, చర్చించిన సంభాషణలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని మోదీ వివరించారు. ఆయన చేసిన కృషి భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుందన్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని.. దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబానికి భగవంతుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa