వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మైనింగ్ స్కాంలో ఆయనపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని మూడు సార్లు నోటీసులు పంపించినా ఆయన హాజరు కాలేదు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు కూడా పిటిషన్‌ను కొట్టేసింది. ఈ క్రమంలో విదేశాలకు పారిపోకుండా తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.12 రోజులుగా కాకాణి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa