AP: విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖపై ప్రజలకు సంతృప్తి పెరిగేలా పనిచేయాలని కమిషనర్లకు సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa