హిందూపురంలో వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న(సోమవారం) ఇద్దరు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్లారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఇవాళ వైయస్ఆర్‌సీపీ నేత వేణరెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు మాట్లాడుతూ... మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైయస్ జగన్ ఫోటోను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్న బాబ్జన్‌పై దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలు కాడంతో కదిరి ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో ఘటన జరిగింది. ఫోన్‌లో దూషించిన టీడీపీ నేతలు, అనంతరం దాడి చేశారు అని అన్నారు.
![]() |
![]() |