సీఎం చంద్రబాబు దళితుల వ్యతిరేకి అని, ఆయన దళిత సమాజాన్ని అణగదొక్కారని.. ఇప్పుడు ఓట్ల కోసమే ఆయన అంబేడ్కర్ పేరు వాడుతున్నారని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. మాట్లాడుతూ.... ఓట్ల కోసమే చంద్రబాబు అంబేడ్కర్ పేరు వాడుతున్నారన్న వారు, ఆయన పాలనలో దళితులకు రోజూ కష్టాలే అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులను అణగదొక్కుతూనే ఉన్నారు. దళితుల జీవితాలను ఆయన చిన్నాభిన్నం చేస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు అమలు చేయడం ద్వారా జగన్‌గారు తన 5 ఏళ్ల పాలనలో వెనుకబడిన వర్గాల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా, కూటమి ప్రభుత్వంలో ఈ 10 నెలల చంద్రబాబు పాలన దళితులకు శాపంలా మారింది. నాడు జగన్‌గారు తీసుకొచ్చిన విద్య, వైద్య విప్లవాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. దళితులకు అండగా నిలిచే ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా ప్రధాన లబ్ధిదారులుగా ఉన్న దళితుల భవిష్యత్తు ఆశలను చంద్రబాబు చిదిమేశారు. అలా దళితులను అభివృద్ధికి మరింత దూరం చేసిన చంద్రబాబు, వారి భవిష్యత్తును ఎలా బాగు చేస్తారు?. అంబేడ్కర్ అందరివాడని చెబుతున్న చంద్రబాబు, విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన అంబేడ్కర్ స్మృతివనాన్ని చంద్రబాబు ఎందుకు సందర్శించలేదు? స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్టేడియమ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినా, పక్కనే ఉన్న అంబేడ్కర్ స్మృతివనాన్ని పట్టించుకోలేదు. ఆ వనాన్ని సందర్శించకపోగా నిర్వహణ బాధ్యత కూడా విస్మరించారు. అంతేకాకుండా, ఆ స్మృతివనంలో శిలాఫలకంపై అప్పటి సీఎం జగన్‌గారి పేరు ఉంటే, టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే దాన్ని ధ్వంసం చేసింది. ఇది అత్యంత హేయం అని అన్నారు.
![]() |
![]() |