సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ గవాయ్ బాధ్యతలు స్వీకరించి ఈ ఏడాది నవంబర్ 24 వరకు సీజేఐగా కొనసాగనున్నారు.జస్టిస్ సంజీవ్ ఖన్నా 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని తన న్యాయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తొలుత తీస్ హజారీ కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 2004లో ఇన్‌కమ్ టాక్స్ విభాగానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. అలాగే ఢిల్లీ హైకోర్టులో ఎమికస్ క్యూరీగా (కోర్టుకు సలహాలు ఇచ్చే న్యాయ నిపుణుడు) మరియు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa