ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా వెళ్లి కొనడమే చౌక.. అమెరికన్ల షాపింగ్ ట్రిప్‌లు మొదలు

international |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 09:08 PM

అమెరికా ట్రంప్ మామకి, చైనా జిన్‌పింగ్ బాబాయ్‌కి మధ్య జరుగుతున్న టారిఫ్ వార్ గురించి మనందరికీ తెలిసిందే! ముందు అమెరికా టారిఫ్ వార్‌ను మొదలుపెడితే.. చైనా సైతం తగ్గేదేలా అంటూ అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచింది. ఇది అంతటితో ఆగలేదు. ఇరు దేశాలు పోటీ పోటీగా టారిఫ్‌లు పెంచుకుంటూ పోయాయి. చైనా దిగుమతులపై ఏకంగా 245 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో జనాలు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. నిజంగానే చైనా దిగుమతులపైగా గనుక 245 శాతం టారిఫ్‌లు విధిస్తే.. దాని ప్రభావం సగటు అమెరికన్‌పై ఎలా ఉంటుందో ఓ కల్పిత ఉదాహరణతో చూద్దాం..


అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన జాన్.. లేటెస్ట్ ఐఫోన్ కొనడానికి ఉత్సాహంగా స్టోర్‌కి వెళ్లాడు. ఫోన్ ధర 1000 డాలర్లు ఉందని అనుకుందాం. ఓకే, బడ్జెట్‌లోనే ఉందనుకొని అని జేబులోంచి కార్డు తీయబోయాడు.


సేల్స్‌పర్సన్ కాలిక్యులేటర్ తీసి టకటకా నొక్కి.. సార్, ఫోన్ 15 ప్రొ మ్యాక్స్ బేస్ ప్రైజ్ 1250 డాలర్లు, దీనికి 245% టారిఫ్ యాడ్ చేస్తే.. మొత్తం 4140 డాలర్లు అవుతుంది! అని నవ్వాడు. జాన్ కళ్లు తేలేశాడు.. 4140 డాలర్లు? ఒక్క ఫోన్‌కా? ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్‌లో చిన్న కారు కొనొచ్చు! లేదంటే ఇంటికి డౌన్‌పేమెంట్ కట్టొచ్చు! అని బిత్తరపోయాడు. "ఈ ఫోన్‌ను ఏమైనా బంగారంతో చేశారా ఏంటి?" అని గొణిగాడు.


జాన్ 'ఐఫోన్ యాత్ర'


జాన్ ఇంటికి వచ్చి ఆలోచనలో పడ్డాడు. 4140 డాలర్లు పెట్టి ఫోన్ కొనడం అంటే జేబుకి చిల్లే కాదు, ఏకంగా గొయ్యి పడ్డట్టే. అప్పుడే అతడికో ఐడియా వచ్చింది. "చైనాలో తయారైన ఫోన్‌పై అమెరికాలో 245% టారిఫ్ వేశారు కదా? అదే ఫోన్ చైనాలోనో, లేదా మరేదైనా దేశంలోనే కొంటే? అక్కడికి విమానం టికెట్ ఎంత అవుతుంది?" అని గూగుల్ చేయడం మొదలుపెట్టాడు.


చైనా వెళ్లి కొంటే: బేస్ ప్రైజ్ 4140 డాలర్లు + రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్ 1000-1200 డాలర్లు + వీసా, అక్కడ రెండు రోజులు ఉండటానికి అయ్యే ఖర్చు ఓ 300 డాలర్లు. మొత్తం సుమారు 2500 డాలర్లు. అంటే అమెరికాలో ఐఫోన్ కొనుగోలు చేసిన దాని కంటే 1640 డాలర్లు తక్కువ ధరకే చైనాలో ఫోన్ కొనుక్కోవచ్చు. అంతే కాదు అక్కడి టూరిస్ట్ ప్లేస్‌లను చూసి రావచ్చు.


వియత్నాం/సింగపూర్/దుబాయ్ వెళ్తే:


ఇక్కడికి కూడా విమాన ఖర్చులు, అక్కడ ఫోన్ ధర కాస్త అటు ఇటుగా ఇలాగే ఉండొచ్చు. అంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అమెరికాలో టారిఫ్‌తో కొనేదానికన్నా ఐఫోన్ ధర తక్కువే అవుతుంది! పైగా ఓ ఇంటర్నేషనల్ ట్రిప్ వేసినట్టు ఉంటుంది. దుబాయ్‌కైతే ఫ్లయిట్ టికెట్లు ఇంక తక్కువ ధరలోనే వస్తాయి. కాబట్టి 1800 డాలర్ల వరకూ ఆదా చేసుకోవచ్చు.


దీంతో జాన్ ఉత్సాహంగా బ్యాగ్ సర్దడం మొదలుపెట్టాడు. ఫోన్ కొనడానికి దుబాయ్ వెళ్తున్నా ఫ్రెండ్స్.. అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టగానే నాక్కూడా ఓ ఫోన్ కొనుక్కొని రా జాన్.. నీకు 500 డాలర్లు ఇస్తాగానీ అని ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు. ఓకే అని రిప్లయ్ ఇచ్చిన జాన్.. 2000 డాలర్లకే ఐఫోన్ ప్లస్ దుబాయ్ ట్రిప్ అని నవ్వుకుంటూ ఫ్లయిట్ ఎక్కాడు.


చైనాపై అమెరికా సుంకాలు ఎడాపెడా పెంచడం వల్ల.. అమెరికన్లు స్వదేశంలో వస్తువు కొనడం కంటే.. విమానం ఎక్కి వేరే దేశం వెళ్లి కొనుక్కొని రావడం బెటర్ అని అనుకునే పరిస్థితి రావచ్చని చెప్పడానికి పైన పేర్కొన్నది ఓ ఉదాహరణ మాత్రమే. వాస్తవానికి దీనికి భిన్నంగా ఉండొచ్చు. కానీ వీకెండ్ రాగానే అమెరికన్లు సూట్ కేసు పట్టుకొని షాపింగ్ కోసం దుబాయ్‌కో లేదా లండన్‌కో వెళ్లే రోజులు రావొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa