AP: బాపట్ల జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. రేపల్లె మండలం పెనుమూడి వద్ద నదిలోకి దిగిన ఇద్దరు యువకులు మృతిచెందారు. బాప్టిస్ట్ తీసుకునేందుకు బంధువులతో కలిసి, నదిలో స్నానం చేసేందుకు ఐదుగురు యువకులు దిగారు. ఈ క్రమంలో దేవదాసు, గౌతమ్ అనే యువకులు నీటిలో మునిగి మృతి చెందగా.. గమనించిన స్థానికులు మరో ముగ్గురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa