బీహార్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల వయసుకే ఐపీఎల్ ఆడుతున్న అత్యంత పిన్న వయసు క్రికెటర్ గా నిలిచాడు. ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఈ కుర్రాడు ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ గా బరిలో దిగాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన సూర్యవంశి తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్స్ కొట్టి తన అరంగేట్రాన్ని అదిరిపోయే రీతిలో చాటాడు. ఆ బంతి వేసింది ఏదో అల్లాటప్పా బౌలర్ కాదు. సీనియర్ బౌలర్ శార్దూల్ ఠాకూర్. శార్దూల్ ఠాకూర్ విసిరిన ఆ బంతి స్వింగ్ అయినప్పటికీ, ఏమాత్రంలెక్కచేయనిసూర్యవంశి కాస్త వెనక్కి జరిగి కవర్స్ మీదుగా భారీ సిక్స్ గా మలిచాడు. మొత్తమ్మీద ఈ ఇన్నింగ్స్ వైభవ్ సూర్యవంశి 20 బంతుల్లో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. 181 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 113 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 55, కెప్టెన్ రియాన్ పరాగ్ 15 పరుగులతో ఆడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa