రాప్తాడు మండలం భోగినేపల్లి గ్రామానికి చెందిన కంసాలి సూరి గత రెండు రోజుల క్రితం ఆలమూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న ఎంఎల్ఏ సునీత గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, 70వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. పిల్లల చదువులతో పాటు అన్నివిధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa