సాయంత్రం హైదరాబాద్‌లో వైసీపీ జాబితా విడుదల .పులివెందుల నుంచి ఇడుపలపాయకు జగన్.తాజా ఎన్నికల్లో పోటీ చేసే వైసిపి అభ్యర్దుల జాబితా ఈ సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. వాస్తవంగా ఈ రోజు ఉదయం 10.26 గంటలకు ఇడుపులపాయ వేదికగా జిబితా విడుదల చేసి..ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని జగన్ భావించారు. అయితే వైయస్ వివేకా హత్య తో వాయిదా పడింది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో ఈ రోజు సాయంత్రం లిస్టు విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa