ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నిక సన్నాహక సభలో శంఖం పూరించిన సిఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2019, 11:17 PM

మీ ఉత్సాహం చూస్తుంటే తమ్ముళ్ళూ నాకు ధైర్యం వచ్చింది. జిల్లాలో పదికిపది సీట్లు గెలుచుకుంటాం. ప్రతిపక్షానికి ఒక్క సీటు కూడా ఇవ్వం. మీ అందరికీ నేనే డ్రైవర్‌గా ఉంటా... రాష్ట్రాన్ని నెంబర్‌`1గా ముందుకు నడిపిస్తానని  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆనందాన్ని వ్యక్తపరిచారు. శనివారం  రాత్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్త‌లు,  సేవమిత్రులు, కుటుంబ సభ్యుల‌తో జరిగిన భారీ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిధిగా మాట్లాడారు.  ఈ సభకు జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ముందుగా మంత్రులు కళావెంకటరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి ఆశోక్‌ గజపతిరాజు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జిల్లాకు చెందిన శాసన సభ్యురాలు గుండల‌క్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, బెందాళం ఆశోక్‌, కమట వెంకటరమణ, కార్యకర్తల‌నుద్దేశించి మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి రాత్రి 8.30 గంట సమయానికి  సన్నాహక సభకు చేరుకొని తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల‌మాల‌వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఎన్నికల‌ శంఖారావాన్ని చంద్రబాబు పూరించారు. అనంతరం కార్యకర్తల‌నుద్దేశించి మాట్లాడారు. మీ అందరితో ముఖాముఖిగా మాట్లాడాల‌ని ,కుటుంబసభ్యుల‌ని కలిసి అన్ని విషయాలు చర్చించాల‌ని మీ వద్దకు వచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. ఏప్రిల్‌ 11న రాష్ట్రంలో 16వ సార్వత్రిక ఎన్నిక‌ల‌కు జరుగుతు న్నాయని ప్రతిపక్ష  వైకాపాకు జిల్లానుంచి ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితి ఉండకూడదని పదికిపది స్థానాలు టీడీపీ అభ్యర్ధులే గెలుస్తారనే విశ్వాసం నాకుందన్నారు. రాష్ట్రం ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటకీ డ్వాక్రా మహిళకు ఇచ్చిన హామీ మేరకు పసుపుకుంకుమ క్రింద 2విడతలుగా పదివేలు వంతున అందించడం జరిగిందని, రెండు వేల‌ పెన్షన్‌ ప్రతి పేదకుటుంబానికి అందిస్తూ ఇంటి పెద్దకొడుకుగా వారిని ఆదుకోవడం జరుగుతుందని అభివృధ్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌గా తీర్చిదిద్దడమే తన సంక‌ల్ప‌మ‌న్నారు. మీరు నేను కలిసి శక్తివంతమైన పార్టీగా రాష్ట్రంగా తీర్చిదిద్దేంతవరకు విశ్రమించేదిలేదని బాబు స్పష్టంచేసారు. ఐదేళ్లలో విభజన సమయంలో ఏర్పడిన ఇబ్బందులు కారణంగా రాష్ట్రంలో ఎన్నో ఆటంకాలు, సమస్యల‌తో పాల‌న సాగించామని  ,షెడ్యూల్‌ 9,10 ప్రకారం ఆస్తుల‌ విభజన ఇంకా జరగలేదని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇంకా రాలేదని పేదరికంతో ఇంకా ఇబ్బందులు పడుతున్నారని వెనుకబడిన జిల్లాకు విభజన చట్టంలో హామీ మేరకు ఏ మేర‌కు కేంద్ర ప్రభుత్వం చేయలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేసారు. రైతు బిడ్డగా వ్యవసాయం చేసిన వ్యక్తిగా అన్నదాత కష్టాలు తనకు తెలుసునని వ్యవసాయాన్ని లాభసాటిచేసేందుకు 11శాతం వ్యవసాయాభివృధ్ధి సాధించడం జరిగిందని ప్రతి రైతుకు రుణమాఫి వర్తించేలా ఉపకారంచేసామని చంద్రబాబు చెప్పారు. తల్లిదండ్రుల‌పై ఆధారపడకుండా ఉద్యోగం వచ్చేంతవరకు నిరుద్యోగ  అభ్యర్ధుకు నిరుద్యోగ భృతి  అందించేలా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పరిశ్రమ స్థాపన ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు  మెరుగుపడ తాయన్నారు. నదుల‌ అనుసంధానమే ల‌క్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని వంశదార , నాగావళి అనుసంధానంతోపాటు ప్రధాన నదులైన బాహుదానుంచి పెన్న నది వరకు నదుల‌ అనుసంధానమే తన ల‌క్ష్యమన్నారు. కోడికత్తి పార్టీ అభివృధ్ధిని అడ్డుకుంటున్నాయని జల్లికట్టు స్పూర్తిగా గొడవ‌లు సృష్టిస్తున్నాయని అటువంటి పార్టీకి ఒక్క ఓటు వేసిన అది నష్టమేనని చంద్రబాబు ప్రజల నుద్దేశించి మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa