ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసారి విజ‌య‌వాడ సెంట్ర‌ల్ కింగ్ ఎవ‌రో?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2019, 11:36 PM

మ‌రోమారు బొండాని ఢీ కొట్టేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసిపి త‌ర‌పున మల్లాది విష్ణు ర‌డీ అవుతున్నారు.  2009 జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరుపున ఆయ‌న‌ విజయం సాధించినా,  2014 ఎన్నికల్లో బొండా ఉమా 30 వేలకు పైగా భారీ మెజారిటీ అందుకుని విష్ణుని ఓడించారు.  గ‌త కొంత కాలంగా   సెంట్రల్‌లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవ‌టం త‌న‌కి క‌ల‌సి వ‌చ్చే అంశ‌మ‌ని విష్ణు భావిస్తున్నారు.  కాంగ్రెస్‌లో ఉన్నప్పటి అభిమాన వ‌ర్గం,  నియోజకవర్గంపై మంచి పట్టు ఉండ‌టం, త‌న సామాజికవర్గం  ఎక్కువ‌గా ఉండ‌టంతో పాటు  టీడీపీ మీద వ్యతిరేకిత తనకి కలిసొస్తుందని త‌న గెలుపు ఖాయం చేసుకోవ‌చ్చ‌ని ఆయ‌న చెపుతున్నారు.  


 


అయితే టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన బొండా ఉమా మీద    ప్ర‌జ‌ల‌ను చుల‌క‌న‌గా చూస్తార‌ని,, భూ క‌బ్జాలు చేర‌న్న  ఆరోప‌ణ‌లు బాగానే వినిపిస్తున్నా,  విజ‌య‌వాడ సెంట్రల్‌లో ప్రజలకు సంక్షేమ పథకాలు ఖ‌చ్చితంగా అందేలా చేయడంలో   బొండాకి కలిసివ‌చ్చే అంశం. దీనికి తోడు .నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు అధికం. కాపు సామాజికవర్గం కూడా గణనీయంగా ఉండ‌నే ఉంది.   సెంట్రల్‌లో గట్టి పట్టు ఉన్న వంగవీటి రాధా టీడీపీలో చేరడం కలిసొచ్చే అంశం.   మల్లాది భావిస్తున్నారు. అటు విజయవాడ సెంట్రల్ జనసేన నుంచి బొండా ఉమ బంధువు కోగంటి సత్యం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నా. ఓటింగ్ చేయించుకునే కేడ‌ర్ లేక‌పోవ‌టంతో  ్ర‌ప‌భావం ఎంత‌వ‌ర‌కుంటుంద‌ని చెప్ప‌డం క‌ష్టం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa