ఏలూరు లోక్ సభ స్థానంలోజనసేన పార్టీ తరఫున డాక్టర్ పెంటపాటి పుల్లారావు రంగంలోకి దిగనున్నారు ఈ మేరకు . శనివారం రాత్రి విజయవాడ కార్యాలయంలోఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పెంటపాటి పుల్లారావు గతంలో గిరిజనుల కోసం, పర్యావరణ సమస్యలపైనా పోరాడిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని నేడు కోట్లు పెడితే పార్లమెంటు సభ్యుడిని అయిపోవచ్చని అందరూ ఇప్పుడు వస్తున్నారని, కానీ నమ్మిన విలువల కోసం కట్టుబడ్డ పెంటపాటి పుల్లారావు ని పార్లమెంటుకు పంపాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టం చేసారు.
పుల్లారావు ఎక్కువ భాగం విదేశాల్లోనే చదువుకున్నా ఈ దేశ సంస్కృతి, సంప్రదాయాలపై ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి అవరం తమ పార్టీకి ఈ దేశానికి కూడా అవసరమన్నారు.. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ జియావుర్ రెహమాన్ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa