రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు మే నెల 2 తారీకున ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలు మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ కి టిడిపి అధిష్టానం బాధ్యతలు సోమవారం అప్పగించింది. జవహర్ మాట్లాడుతూ 26 జిల్లాల నుంచి సుమారు 5 లక్షల మంది ప్రజలు తరలిరానున్నారన్నారు. సభకు వచ్చే వారు ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని జవహర్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa