పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్‌పై మరోసారి వతీవ్ర విమర్శలు గుప్పించారు. ‘లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ ప్రభుత్వం, ని గూఢచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అక్రమ సంతానమని ఆరోపించారు. పాకిస్థాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్‌లో ఉంచేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మనీలాండరింగ్, ఉగ్రవాద నిధుల పర్యవేక్షణ కోసం పనిచేసే ఎఫ్ఏటీఎఫ్.. బ్లాక్, గ్రే లిస్ట్‌లోని దేశాలపై చర్యలను సూచిస్తాయి.
‘కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం . కశ్మీరీలు కూడా భారత్‌కు అంతర్భాగమే. ఉగ్రవాదులతో పోరాడుతూ ఎవరు ప్రాణాలు కోల్పోయారు? గాయపడిన వారిని భుజాన వేసుకొని ఎవరు నడిచారు? కశ్మీరీలపై ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది... మనమంతా ఏకతాటిపై ఉండాలి. పాకిస్థాన్, ఐఎస్, లష్కరే తొయిబా కలిసి భారత్‌లోని హిందూ, ముస్లింల మధ్య వివాదాలు సృష్టించాలనుకుంటున్నారు’ అని మీడియాకు సూచించారు. పాకిస్థాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదులను శిక్షణ ఇచ్చి భారత్‌పై దాడులు చేయిస్తున్నదని ఒవైసీ ఆరోపించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్‌కు పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌ను నిర్బంధించేందుకు, వారి ఇంటర్నెట్‌పై సైబర్ పరికరాలతో హ్యాక్ చేయడం సాధ్యమని చెప్పారు. పాకిస్థాన్ భారత్ కంటే అర్ధశతాబ్దం వెనుకబడిపోయిందని, అరగంట కాదని, మా దేశం రక్షణ బడ్జెట్‌లో సగం కూడా ఈ మొత్తం బడ్జెట్ లేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే కూడా పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. ‘అణు బాంబులు వేస్తామని పాకిస్థాన్ బెదిరిస్తోంది? మీకు తినడానికి తిండి కూడా దొరకడం లేదు, ఇంకా బాంబుల గురించి మాట్లాడుతున్నారా? 1971 గుర్తుందా? లేదంటే మీ పెద్దలను అడిగి తెలుసుకోండి... మీ స్థాయి ఏంటో తేలుసుకుని నోర్ముసుకుని కూర్చోండి. జోకర్లలా మాట్లాడొద్దు’ అని ఆమె X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు. పర్యాటకులపై దాడి అనంతరం ముష్కరులు అడవుల్లోకి పారిపోగా భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు అప్పటి నుంచి వారి కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నాలుగు సార్లు చేతికి చిక్కినట్టే చిక్కి ముష్కరులు తప్పించుకున్నారు. ఓసారి భద్రతా బలగాలపై కాల్పులకు కూడా పాల్పడ్డారు. ఆపై మరోచోట భోజనం తీసుకుని పారిపోయారు. అయినా, భారత బలగాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారి కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa