ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఉగ్రవాదులకు తమ దేశం మద్దతు ఇవ్వడమే కాకుండా, వారికి శిక్షణ కూడా ఇస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా అంగీకరించిన విషయాన్ని భారత్ ప్రముఖంగా ప్రస్తావించింది. పాకిస్థాన్ ఈ అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తూ, భారత్‌పై నిరాధార ప్రచారానికి పాల్పడుతోందని మండిపడింది.భారత డిప్యూటీ పర్మినెంట్ రెప్రజెంటేటివ్ యోజన పటేల్ మాట్లాడుతూ, పాకిస్థాన్ తీరును తీవ్రంగా ఖండించారు. "ఒక నిర్దిష్ట ప్రతినిధి బృందం ఈ వేదికను దుర్వినియోగం చేయడం, దాని ప్రాముఖ్యతను తగ్గించడం దురదృష్టకరం. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో పాక్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, శిక్షణ, నిధులు సమకూర్చడం వంటి చరిత్రను అంగీకరించిన విషయాన్ని ప్రపంచమంతా విన్నది" అని యోజన పటేల్ గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa