రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రూ. 150 కోట్ల పెట్టుబడితో ఏటా 12-20 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియాకు చెందిన ఆర్వెన్సిస్ గ్రూప్ ఆసక్తిని చూపింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యి తమ ఆసక్తిని తెలిపారు. పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న విస్తృత అవకాశాలను ఆ కంపెనీ ప్రతినిధులకు మంత్రి వివరించారు. పునరుత్పాదక విద్యుత్తు రంగంలో సంస్థల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. ఆర్వెన్సిస్ ప్లాంటు ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వచ్చే ఉద్యోగావకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు. త్వరితగతిన సీబీజీ ప్లాంటును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులను మంత్రి గొట్టిపాటి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa