ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాజ్ మహల్ పరిధిలో చెట్లను నరికివేయాలంటే అనుమతి తప్పనిసరి

national |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 04:33 PM

చారిత్రక కట్టడం తాజ్ మహల్ పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజ్ మహల్ కు 5 కిలోమీటర్ల పరిధిలో చెట్లను నరికివేయాలంటే తమ ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు 2015లో తాము జారీ చేసిన ఆదేశాలనే పునరుద్ఘాటిస్తున్నట్లు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.తాజ్ ట్రెపీజియం జోన్ (టీటీజడ్) పరిధిలోని ప్రాంతాల్లో చెట్ల నరికివేత అంశం సుప్రీంకోర్టు ముందు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో, తాజ్ కు 5 కిలోమీటర్ల పరిధి దాటి, టీటీజడ్ లో ఉన్న ఇతర ప్రాంతాల్లో చెట్లను నరికివేయాల్సి వస్తే, సంబంధిత డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) లేదా కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) నుంచి ముందస్తు అనుమతి పొందాలని ధర్మాసనం సూచించింది. ఈ ప్రక్రియలో అధికారులు ఉత్తరప్రదేశ్ చెట్ల పరిరక్షణ చట్టం నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది."తాజ్ మహల్ కు 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు సంబంధించి, 2015 మే 8 నాటి మా అసలు ఉత్తర్వులు కొనసాగుతాయి. ఆ ప్రాంతాల్లో 50 కంటే తక్కువ చెట్లను నరికివేయాల్సి వచ్చినా, అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై మేము కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) సిఫార్సులను కోరి, ఆ తర్వాతే చెట్ల నరికివేతను పరిశీలిస్తాం" అని ధర్మాసనం వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa