విశాఖపట్నంలో మధురవాడ పరిధిలోనూ కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కొమ్మాది కూడలి వద్ద రోడ్డు మధ్యలోని డివైడర్ దాటుతున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టింది. సెంట్రల్ విద్యుత్తు దీపాలకు చెందిన కరెంట్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. అయితే ఈ విషయాన్ని గమనించని కృష్ణకుమార్ అనే వ్యక్తి గురువారం ఆర్ధరాత్రి ఆటో దిగి రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కరెంట్ తీగలు తగలడంతో కరెంట్ షాక్‌కి గురయ్యాడు. అక్కడ ఉన్న కొంతమంది ఈ విషయాన్ని గుర్తించి కృష్ణకుమార్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కృష్ణకుమార్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa