జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముందు ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఈ నివేదికను స్వయంగా ప్రవేశపెట్టనున్నారు.
ఈ దాడి సందర్భంగా ఇప్పటివరకు 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఎన్‌ఐఏ దాదాపు 3,000 మందిని విచారించగా, 100కు పైగా ప్రాంతాల్లో భద్రతా బలగాలు సోదాలు నిర్వహించాయి. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు ఎన్‌ఐఏ తీవ్రంగా దర్యాప్తు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa