ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భీమవరంలో నడిరోడ్డుపై వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 04:43 PM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉండి గ్రామం పేద‌పేటకు చెందిన గాతల క్రాంతికుమార్ (35) అనే వ్యక్తి, పట్టణంలోని మల్టీఫ్లెక్స్ ఎదురుగా ఉన్న రోడ్డుపై ఈ ఘోర చర్యకు పాల్పడ్డాడు. 
తీవ్ర గాయాలతో రక్తం కారడంతో స్థానిక పోలీసులు అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ క్రాంతికుమార్ మరణించాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa