జనసేన పార్టీ లో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు, ప్రముఖ వ్యాపారవేత్త పరుచూరి భాస్కరరావు చేరారు. ఈరోజు సాయంత్రం విజయవాడలోని 'జనసేన' కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, గతంలో కాంగ్రెస్ పార్టీలో భాస్కరరావు పనిచేశారు. పార్టీలో పలు బాధ్యతలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa