ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వామ‌ప‌క్ష‌ల‌తో జ‌న‌సేన స‌ర్ధుబాట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 11:15 PM

రెండు వామపక్ష పార్టీలకు రెండేసి లోక్‌సభ, ఏడేసి అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పారు. వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి పవన్‌ మీడియాతో మాట్లాడారు. పోరాటాలు చేయడానికే కాకుండా చట్టసభల్లోనూ వామపక్షాల పాత్ర ఉండాలనే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. ఆ రెండు వామపక్ష పార్టీలకు రెండేసి లోక్‌సభ, ఏడేసి అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు .వామపక్షాలకు కేటాయించిన స్థానాలివే... సీపీఎం అసెంబ్లీ స్థానాలు: 1. కురుపాం (విజయనగరం జిల్లా) 2. అరకు ( విశాఖపట్నం జిల్లా) 3. రంపచోడవరం (తూర్పుగోదావరి జిల్లా) 4. ఉండి (పశ్చిమగోదావరి జిల్లా) 5. విజయవాడ సెంట్రల్‌ (కృష్ణా జిల్లా) 6. సంతనూతలపాడు (ప్రకాశం జిల్లా) 7. కర్నూలు (కర్నూలు జిల్లా) పార్లమెంటు స్థానాలు: 1. కర్నూలు 2. నెల్లూరు సీపీఐ అసెంబ్లీ స్థానాలు: 1. పాలకొండ (శ్రీకాకుళం) 2. ఎస్‌.కోట (విజయనగరం జిల్లా) 3. విశాఖ పశ్చిమ (విశాఖపట్నం జిల్లా) 4. నూజివీడు (కృష్ణా జిల్లా) 5. మంగళగిరి (గుంటూరు జిల్లా) 6. కనిగిరి (ప్రకాశం జిల్లా) 7. డోన్‌ (కర్నూలు జిల్లా) పార్లమెంట్‌ స్థానాలు: 1. అనంతపురం 2. కడప .  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa