శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుపతి నుంచి కాలినడకన తిరుమల చేరే సామాన్య భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) 20 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను నడపనుంది. ఈ బస్సులు తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను చేర్చనున్నాయి. TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం TTD ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత ధర్మరథం బస్సులు భక్తుల రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో, భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సుల సేవలను ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయం కాలినడక యాత్రికులకు గొప్ప వరంగా నిలవనుంది, వారి యాత్రను మరింత సౌకర్యవంతంగా, సులభతరంగా మార్చనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa