ఈ రోజుల్లో గుండె జబ్బు బాధితులు వయస్సుతో సంబంధం లేకుండా పెరుగుతున్నారు. అంతే కాకుండా.. ఎక్కువ మంది చనిపోతున్నారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం, తీసుకెళ్లినా.. సరైన వైద్యం అందకవడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. కానీ, టెనెక్టిప్లేస్ ఇంజెక్షన్‌తో ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఇప్పటికీ చాలా మంది ఈ సూది మందుతో ప్రాణాప్రాయ స్థితి నుంచి బయటపడ్డారు. మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఈ ఔషధాన్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
గుండెపోటుతో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. గుండెపోటు చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికి వస్తోంది. సకాలంలో వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో ఆసుపత్రికి తీసుకుపోతే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ, అప్పటి వరకు ప్రాణాలు నిలబెట్టే అత్యంత ఖరీదైన సూది మందును ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ, విషయం తెలయక పోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌లో ఈ ఇంజక్షన్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇప్పటికే పలు సీహెచ్సీలకు తరలించి, స్టాక్ అందుబాటులో ఉంచారు. దీని పేరు టెనెక్టిప్లెస్ ఇంజెక్షన్. దీని ధర 25వేల నుంచి 40 వేల రూపాయలకు వరకు ఉంటుంది. ఇంత ఖరీదైన సూది మందును ప్రభుత్వం గుండె జబ్బు రోగుల కోసం అందుబాటులో ఉంచడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడుకున్నారు. మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించే వరకు ఈ సూదిని ఇచ్చి ప్రాణప్రాయ స్థితి నుంచి బయటపడవచ్చు. అందుకోసం గుండెపోటు వచ్చినప్పుడు సకాలంలో కుటుంబ సభ్యులు స్పందించి ఆసుపత్రికి తీసుకురావాలి.
ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ వ్యక్తికి ఛాతిలో నొప్పి వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిశీలించిన వైద్యులు ఆ వ్యక్తికి ఈసీజీ, 2డీ ఎకో తీశారు. దీంతో గండె జబ్బు వచ్చినట్టు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యుల అనుమతితో టెనెక్టిప్లెస్ సూది మందును ఛాతిలో ఇచ్చారు. ఆయన తేరుకున్నాక.. తిరుపతికి తరలించి మెరుగైన చికిత్స అందించారు. దీంతో ప్రాణాప్రాయ స్థితి నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. గుండెపోటుతో ఎవరైనా సకాలంలో ఆసుపత్రికి వస్తే టెనెక్టిప్లెస్ సూది మందుతో ప్రాణాలు కాపాడొచ్చు. గుండె సమస్య ఉన్నవారికి వైద్యుల సలహా, కుటుంబ సభ్యుల సమ్మతితో ఈ మందును ఇస్తారు. గుండెపోటు బాధితులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. ఇంత మంచి సేవలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తే.. చాలా మంది ప్రాణాలు కాపాడుకుంటారు కదా..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa