కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ హాజరయ్యారు.
సరిహద్దు భద్రత, అంతర్గత భద్రతా సవాళ్లు, సమన్వయం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం సరిహద్దు రాష్ట్రాలలో భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa