భారత్ మరియు పాకిస్తాన్ మధ్య చర్చలకు తమ మద్దతు ఉందని బ్రిటన్ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్ మరియు పిఒకెలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేపట్టిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
ఈ దాడుల అనంతరం బ్రిటన్ వ్యాపార, వాణిజ్య కార్యదర్శి జోనాథన్ రెనాల్డ్స్ మీడియాతో మాట్లాడుతూ, జమ్ముకాశ్మీర్‌లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బ్రిటన్, రెండు దేశాల మధ్య సంప్రదింపులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa