అనంతపురం జిల్లా, తాడిపత్రి పరిధిలోని సజ్జలదిన్నెలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలు వేణుగోపాల్ రెడ్డి, తలారి రంగయ్యలు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం అనంతపురంలోని సన్రే హాస్పిటల్లో వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పెద్దారెడ్డి , పార్టీ తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఇలాంటి హింసాత్మక చర్యలపై కఠిన చర్యలు అవసరమని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa