పహల్‌గామ్‌లో 26 మంది పర్యాటకులు చనిపోయారు. అందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ ‘సిందూర్’ చేపట్టి 100 ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మిషన్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొందరు తమ పిల్లలకు ఈ పేరు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా బిహార్‌లోని కతిహార్ జిల్లాలో కుందన్ కుమార్ అనే వ్యక్తి తన కుమార్తెకు 'సిందూర్' అని పేరుపెట్టి దేశభక్తి చాటాడు.కానీ ఆమె పెరిగి పెద్దదైన తర్వాత ఆ పేరుకు ఆర్థం తెలుసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమాయకుల ప్రాణాలను తీయడం ద్వారా దేశానికి హాని కలిగించే పాకిస్థాన్‌లోని ఉగ్రమూకల పీచమణచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టడం తమకు గర్వంగా ఉందన్నారు. పాపకు ఈ పేరు పెట్డడం పట్ల తమ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు పాపకు సిందూర్ పేరును ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది సైతం ఆమోదించారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa