రెండు రోజుల క్రితం ఆయన హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌తో కూడా భేటీ అయిన విశాఖ సీనియర్ నేత కోణతాల రామకృష్ణ చేరిక దాదాపు ఖరారేనని వైకాపా శ్రేణులు భావించిన దశలో తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవటం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.
కొణతాలపై సస్పెన్షన్ ఎత్తివేసి అనకాపల్లి లేదా విశాఖ ఉత్తర సీటులలో ఒకదాన్ని కేటాయిస్తారని అనుకున్నా తీరా వైసీపి ప్రకటించిన జాబితాలో అసలు కొణతాల పేరే లేకుండా పోయింది. అయితే ఎంపీ సీట్లు సహా కొన్ని అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల విషయంచర్చలు జరుపుతున్న టీడీపీ టిక్కెట్ల ఖరారులో ఉన్న నేపథ్యంలో కొణతాల ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్న కొణతాల ఇప్పటికే తన అనుచరగణాన్ని ఆ పార్టీలోకి పంపారు కూడా. మరి ఆయన టిడిపిలో చేరి టిక్కెట్ సాధిస్తారో లేక ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa