పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈక్రమంలోనే పాకిస్థాన్‌లోని అనేక ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. మంగళవారం రోజు మొత్తంగా 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేయగా.. ఆతర్వాత కూడా పాక్ వైమానికి ఎయిర్ బేస్‌లపై దాడులు చేసింది. అయితే ఇందులో పాక్ అణుస్థావరాలు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తుండగా.. తాజాగా దీనిపై ఎయిర్ చీఫ్ మార్షల్ ఎకే భారతి స్పందించారు. కిరానా హిల్స్‌లో అణుస్థావరాలు ఉన్నట్లు చెప్పినందుకు థాంక్స్ అంటూనే.. తాము దానిపై దాడి చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. మే 6వ తేదీ రోజు అర్ధరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది. ఇక అప్పటి నుంచి పాకిస్థాన్ అణుస్థావరంపై దాడి జరిగింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అణ్వాయుధాలను నిల్వ చేసి ఉండొచ్చని చెప్పుతున్న కిరానా హిల్స్.. సర్గోధా వైమానికి స్థావరానికి దగ్గరగా ఉన్నట్లు తెలిసింది. అలాగే సర్గోదా వైమానిక స్థావరంపై దాడి జరగ్గా.. భారత్ కావాలనే కిరానా హిల్స్‌ను లక్ష్యంగా చేసుకుందని కూడా వార్తలు వచ్చాయి.
ముఖ్యంగా సర్గోధా వైమానికి స్థావరాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుందని సైన్యం ధ్రువీకరించగా.. ఈ వార్తలు నిజమేనని అనేక మంది అనుకున్నారు. దీంతో ప్రచారం మరింత ఎక్కువైంది. ఇటీవల పాకిస్థాన్‌లో సంభవిస్తున్న భూకంపాలకు, ఆ స్థావరాన్ని ఢీకొట్టడానికి ముడిపెట్టి కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధికారులు నిర్వహించిన సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. పాకిస్థాన్ తన అణ్వాయుధాలను కిరానా హిల్స్ వద్ద నిల్వ చేస్తుందని చెప్పినందుకు థాంక్స్ అంటూ వ్యాఖ్యానించారు.
అలాగే అక్కడే ఏం ఉన్నప్పటికీ.. తాము మాత్రం ఆ హిల్స్‌ను టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. తాము లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన జాబితాలో అది లేదన్నారు. అలాగే పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులకు అండగా నిలిచి.. వారి పోరాటాన్ని తమ పోరాటంగా మార్చుకున్నాయన్నారు. అందువల్లే భారత సైన్యం దీటుగా బదులు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని కూడా స్పష్టం చేశామన్నారు. అలాగే పాక్‌లోని నూర్‌ఖాన్, రహీమ్ యార్‌ఖాన్ ఎయిర్ బేస్‌లపై దాడి దృశ్యాలను ప్రదర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa