ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1.65 లక్షల కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి : సిఎస్ పునేఠ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2019, 01:48 AM

రాష్ట్రంలో అత్యంత కరువు జిల్లాలైన అనంతపురం, కర్నూల్, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని లక్షా 65వేల కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఆంధ్రప్రదేశ్ కరువు సంసిద్ధత పధకం (పల్లెజీవం) ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం అమరావతి సచివాలయంలో ఎపి డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరువు ప్రాంత జిల్లాల్లోని కుటుంబాలను ఆర్ధికంగా, సామాజికంగా అన్ని విధాలా అభివృద్ధిలోకి తీసుకురావ‌డంతో పాటు వారి జీవన ప్రమాణాలను పూర్తిగా మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా కరువు నుండి పంటలను కాపాడడానికి అనుకూలమైన నీటిపారుదల పద్ధతులు, మెరుగైన భూసార పరిరక్షణ, కరువును తట్టుకునే విధంగా పంట రకాలు, ఉద్యానవన పంటలకై మెరుగైన పద్ధతుతుల‌ను ప్రోత్స‌హించాలని అధికారులకు సూచించారు. వర్షపునీటి నిల్వద్వారా మరింత నీటిని అందుబాటులోకి తీసుకుని భూగర్భ జలాలు రీచార్జ్ చేయడం, వాతావరణం, మార్కెట్, పంటల ఎంపిక గురించి సమాచారం అందించేకు కృషి చేయాలని సిఎస్ పునేఠ ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa