ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలంలో వైభవంగా వెండి రథోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 10:02 PM

శ్రీశైలం దేవస్థానం సోమవారం స్వామి అమ్మవారి వెండి రథోత్సవం వైభవంగా జరిగింది. ప్రతి సోమవారం ఆలయ ఆవరణలో స్వామి అమ్మవారికి వెండి రథోత్సవాన్ని సర్కారీ సేవగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వెండి రథంలో కొలువు తీర్చారు. ఆ తర్వాత స్వామి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa