టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేస్తూ, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఈ రన్ మెషీన్, ఉన్నట్టుండి సుదీర్ఘ ఫార్మాట్‌కు స్వస్తి చెప్పడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. టెస్టు క్యాప్‌తో ఉన్న ఒక భావోద్వేగభరితమైన ఫొటోను పంచుకుంటూ కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. "అందరికీ నమస్కారం. నేను టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఈ ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఇన్నేళ్లుగా నాపై చూపించిన ప్రేమ, మద్దతుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
ఒకప్పుడు యువకుడిగా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ.. 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుతూ, "సచిన్ టెండూల్కర్ 21 ఏళ్లు దేశం మొత్తాన్ని తన భుజాలపై మోశాడు, కాబట్టి ఇప్పుడు మనం అతన్ని మన భుజాలపై మోసే సమయం వచ్చింది" అన్న మాటలు నేటికీ అభిమానుల గుండెల్లో నిలిచి ఉన్నాయి. ఆనాటి నుంచి కోహ్లీని.. సచిన్ వారసుడిగా భావించారు.
టెండూల్కర్ తర్వాత కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. ఈ క్రమంలోనే సచిన్ పేరిట ఉన్న ఎన్నో రికార్డుల్ని బద్ధలుకొట్టాడు. 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డుకు చేరువలోకి వచ్చాడు. వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 27 వేల పరుగులు చేయడంతో పాటు ఇలా కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. ఇప్పుడు 14 ఏళ్ల టెస్టు కెరీర్‌కు ముగింపు పలుకుతూ కోహ్లీ ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసినట్లయింది. కోహ్లీ, టెండూల్కర్ వారి రిటైర్మెంట్ సమయంలో టెస్టు రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.
విరాట్ కోహ్లీ వర్సెస్ సచిన్.. టెస్ట్ రన్స్
2013లో రిటైర్మెంట్ సమయానికి సచిన్ టెండూల్కర్ 200 టెస్టుల్లో మొత్తం 329 ఇన్నింగ్స్‌ల్లో 15921 పరుగులు చేశాడు. సచిన్ సగటు 53.78 గా ఉంది. కోహ్లీ 123 టెస్టుల్లో 210 ఇన్నింగ్స్‌ల్లో 9230 పరుగులతో తన కెరీర్‌ను ముగించాడు. కోహ్లీ సగటు 46.85 గా ఉంది. ఇక్కడ కోహ్లీ, టెండూల్కర్ కంటే 6691 పరుగులు వెనుకబడి ఉన్నాడు.
సచిన్ 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ టెస్ట్ కెరీర్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
టెస్టుల్లో డబుల్ సెంచరీల విషయానికి వస్తే.. కోహ్లీ 7 ద్విశతకాలు బాదగా.. సచిన్ 6 డబుల్ సెంచరీలు చేశాడు.
కోహ్లీ వర్సెస్ సచిన్- టెస్ట్ మ్యాచ్‌లు..
రిటైర్మెంట్ సమయానికి టెండూల్కర్ 200 టెస్టులు ఆడగా.. కోహ్లీ 123 మ్యాచ్‌లతో తన టెస్ట్ ప్రస్థానాన్ని ముగించాడు. కోహ్లీ 200 టెస్టుల మైలురాయిని చేరుకోవాలంటే మరో 5 నుంచి 6 సంవత్సరాలు ఈ ఫార్మాట్‌లో కొనసాగాల్సి ఉండేది.
కెప్టెన్సీ విషయానికి వస్తే మాత్రం.. సచిన్ 25 టెస్టుల్లో భారత్‌కు సారథిగా వ్యవహరించగా.. నాలుగు గెలిపించి.. తొమ్మిదింట్లో ఓడాడు. 12 డ్రా అయ్యాయి. విన్ పర్సంటేజ్ 30.76%గా ఉంది. ఇక కోహ్లీ 68 మ్యాచ్‌ల్లో టెస్టుల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా.. 40 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. మరో 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 11 డ్రా అయ్యాయి. ఇక్కడ విజయశాతం 70.17 గా ఉంది.
మొత్తానికి, విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం భారత క్రికెట్‌కు ఒక పెద్ద లోటు. అయితే, వన్డే ఫార్మాట్‌లో అతను తన సత్తా చాటుతూనే ఉంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa