.టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 36 ఏళ్ల విరాట్ కోహ్లీ.. మరికొన్నేళ్లు తనకు ఇష్టమైన టెస్టు క్రికెట్‌లో కొనసాగుతాడని అంతా భావించారు. తన టెస్టు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని ఎప్పుడూ చెప్పే కోహ్లీ.. అనూహ్యంగా రిటైర్మెంట్ పలికి అందర్నీ షాక్ చేశాడు. టెస్టు క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కోహ్లీ.. తన చిరకాల కోరిక మాత్రం నెరవేర్చుకోకుండానే వీడ్కోలు పలికాడు.
విరాట్ కోహ్లీ 2011లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. సబీనా పార్క్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్. కోహ్లీ ఈ ఫార్మాట్‌లో తొలి సెంచరీని ఆస్ట్రేలియా గడ్డపై సాధించాడు. ఆడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో 116 రన్స్ స్కోరు చేశాడు. ధోనీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పడంతో.. ఆస్ట్రేలియా పర్యటనలోనే కోహ్లీ తొలిసారి సారిథిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత సుదీర్ఘ కాలం జట్టును నడిపించాడు.
ఆ తర్వాత కోహ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2014లో డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్, వెర్నాన్ ఫిలండార్, జాక్వెస్ కలిస్ లాంటి బౌలర్లను ఎదుర్కొని.. రెండు సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో పరుగుల వరద పారించాడు. ఇక 2018లో తీవ్ర ఒత్తడితో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాడు కోహ్లీ. 2014 పర్యటనలో అతడు కేవలం 13.40 సగటుతో మాత్రమే రన్స్ చేశాడు. ఈసారి ఎలాగైనా రాణించాలనే పట్టుదలతో అడుగుపెట్టిన విరాట్.. ర్మింగ్‌హామ్‌లో 149 రన్స్, నాటింగ్‌హామ్‌లో 103 రన్స్‌తో విమర్శకులకు సమాధానం చెప్పాడు. ముఖ్యంగా తనను పదే పదే ఔట్ చేసిన జేమ్స్ అండర్సన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కోహ్లీ.
2016లో తొలి డబుల్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత స్పల్ప వ్యవధిలోనే మరో ఆరు డబుల్ సెంచరీలు చేశాడు. అయితే 2019 తర్వాత విరాట్ టెస్టు కెరీర్ గాడి తప్పింది. అప్పటి నుంచి సుమారు నాలుగేళ్ల పాటు సెంచరీ చేయలేకపోయాడు. మళ్లీ 2023లో మూడంకెల మార్కును అందుకున్నాడు. కోహ్లీ తన చివరి టెస్టు సెంచరీ ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో సాధించాడు. చివరి టెస్టు మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా గడ్డపైనే ఆడాడు.
అయితే 2013లో కోహ్లీ మాట్లాడుతూ.. టెస్టు కెరీర్‌లో 10,000 రన్స్ స్కోరు చేయడమే తన లక్ష్యమని చెప్పాడు. కానీ 123 టెస్టులాడిని కోహ్లీ.. తన కెరీర్‌లో 9230 రన్స్ మాత్రమే చేశాడు. తన చిరకాల కోరికకు 770 రన్స్ దూరంలో ఆగిపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa